బెజవాడ జంట హత్యల కేసులో పురోగతి | progress in vijayawada double murder case | Sakshi
Sakshi News home page

బెజవాడ జంట హత్యల కేసులో పురోగతి

Oct 15 2013 2:43 PM | Updated on Sep 29 2018 4:52 PM

విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

విజయవాడ : విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నగలు, నగదు కోసమే నిందితుడు ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో లిప్ట్ మెకానిక్ ప్రధాని నిందితుడిగా భావిస్తున్నారు. పండక్కి అందరూ ఊరెళ్లారని తెల్సుకుని .. ఇంట్లో బామ్మ, మనవరాలే ఉన్నారని గమనించి దుండగుడు ఈ ఘటనకు పాల్పడ్డారు.

అత్యంత దారుణంగా కత్తులతో గొంతుకోసి, ఇక చోరీ చేద్దామనేలోగా, ఏదో అలికిడి వినబడి పారిపోయాడు.  ఈ దారుణంలో  సత్యనారాయణ భార్య పుణ్యవతి, మనవరాలు సాయిచంద్రికలు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. చంద్రికతో ఆడుకుందామని ఆమె ఇంటికి వచ్చిన స్నేహితులు .. వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి పెద్దలకు చెప్పగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement