ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా | private travels bus overturned in krishna district | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Jun 10 2017 7:00 AM | Updated on Apr 7 2019 3:24 PM

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్‌లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ట్రావెల్స్‌ బస్సు వెళ్తుండగా ఇబ్రహీంపట్నం సమీపానికి రాగానే అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement