మూడో తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ ప్రతాపం | Principal Beats up Third Class Student in Kurnool | Sakshi
Sakshi News home page

మూడో తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ ప్రతాపం

Sep 15 2019 11:42 AM | Updated on Sep 15 2019 2:15 PM

Principal Beats up Third Class Student in Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: మూడో తరగతి విద్యార్థిపై ప్రతాపం చూపించాడు ప్రిన్సిపాల్‌. రెండు రోజులు స్కూల్‌కి రాలేదన్న కోపంతో విచక్షణా రహితంగా కొట్టాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరులోని విస్‌డమ్‌ స్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. థర్డ్‌ క్లాస్‌ విద్యార్థి రెహాన్‌‌.. చెప్పకుండా స్కూల్‌ మానేశాడన్న కోపంతో ప్రిన్సిపల్‌ ఆ బాబును చావగొట్టాడు. చెంపలు వాయించి.. వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో విద్యార్థి ఒంటి నిండా వాతలు తేలాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు.. స్కూల్‌కి వచ్చి నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఎమ్మెల్యే ఆర్ధర్‌ అక్కడికి చేరుకుని... ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement