104వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర | PrajasankalpaYatra Day 104 Completed | Sakshi
Sakshi News home page

Mar 5 2018 6:22 PM | Updated on Jul 25 2018 5:35 PM

PrajasankalpaYatra Day 104 Completed - Sakshi

సాక్షి, ప్రకాశం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 104వ రోజు ముగిసింది. నేటి ఉదయం అద్దంకి శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదుగా తక్కెళ్లపాడు చేరుకుని యాత్రను ముగించారు.

ఈ క్రమంలో ఆయన 1400 కిలోమీటర్ల మైలురాయిని దాటగా.. ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. నేటి పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 16.3 కిలోమీటర్లు నడిచారు. కాగా, ప్రజాసంకల్పయాత్ర ఇప్పటిదాకా 1414.7 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

105వ రోజు షెడ్యూల్‌
సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాసంకల్పయాత్ర 105వ రోజు షెడ్యూల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. మంగళవారం ఉదయం తక్కెళ్లపాడు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అటుపై యాత్ర జె. పంగులూరు, అరికట్ల వారిపాలెం, గంగవరం మీదుగా ఇంకొల్లు వరకు యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పేరిట పార్టీ ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement