మాజీ మంత్రి అయ్యన్నపై మరో కేసు

Police Registered Another Case On TDP Leader Ayyanna Patrudu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, విధులకు ఆటంకం కలించారనే అభియోగాలపై ఆయనపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కోర్టు ఆయనకు  ముందస్తు  బెయిల్‌ మంజూరు చేసింది. బెయిలు పత్రాలను పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించేందుకు వెళ్లేక్రమంలో అయ్యన్నతన అనుచరులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం అబీద్‌ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎటువంటి అనుమవతి లేకపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో అనుమతి లేకుండా సభ నిర్వహించడం.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన కారణంగా పోలీసులు ఆయనపై మరోసారి కేసు నమోదు చేశారు. 
(చదవండి : మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు)

అంబేద్కర్‌ను అవమానించారు..
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు ఆరుగుల్ల రాజుబాబు డిమాండ్‌ చేశారు. అయ్యన్న, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సోమవారం అబీద్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసేటప్పుడు చెప్పులు తీయకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు. ఇందుకు టీడీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహం వద్ద ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మట్లాడినందుకు అయ్యన్నపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(చదవండి : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెయిల్‌)

రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలి..
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి అనే కనీసం గౌరవం ఇవ్వకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ తీశారు. అయ్యన్న నోటి దురద తగ్గించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్‌ హితవు పలికారు. చట్టంపై గౌరవంలేని అయ్యన్నకు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని ఆయన కోర్టుకు విఙ్ఞప్తికి చేశారు. ఏడు నెలల కాలంలోనే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి బాట పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top