మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు | Police Case Field On Tdp Leader Chintakayala Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి అయ్యన్నపై కేసు నమోదు

Dec 22 2019 3:51 AM | Updated on Dec 22 2019 12:01 PM

Police Case Field On Tdp Leader Chintakayala Ayyanna Patrudu - Sakshi

నర్సీపట్నం: పరుష పదజాలంతో పోలీసులను దూషించిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం పట్టణ సీఐ స్వామినాయుడు శనివారం చెప్పారు .ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన అయ్యన్న సోదరుడు, నర్సీపట్నం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు తన నివాసముంటున్న ఇంటిపైన వైఎస్సార్‌సీపీ జెండా కట్టడంతో ఈ నెల 12న ఘర్షణ జరిగింది. దీంతో ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అయ్యన్న నివాసం వద్దపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసుల విధులకు భంగం కలిగించి, అసభ్యకరంగా దూషించిన అయ్యన్నపై ఈ నెల 20న కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement