బాబుతో కేంద్రమంత్రి భేటీ, ఓటుకు నోటుపై చర్చ | Piyush Goyal meets chandrababu naidu over vote for cash issue | Sakshi
Sakshi News home page

బాబుతో కేంద్రమంత్రి భేటీ, ఓటుకు నోటుపై చర్చ

Jun 4 2015 10:43 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో  కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈరోజు  ఉదయం చంద్రబాబుతో సమావేశం  అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

 

అల్పాహార విందుకు వచ్చిన ఆయన - ఓటుకు నోటు వ్యవహారంలో బీజేపీ అధిష్టానం మనుసులో మాటను చంద్రబాబు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేకు ముడుపులు అందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.  అయితే రేవంత్ రెడ్డి ఎపిసోడ్పై టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై భాగస్వామ్య పార్టీ బీజేపీ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement