తుళ్లూరులో రాజధానిపై సుప్రీంకోర్టులో పిల్ | pil in supreme coourt against capital of ap in tulluru | Sakshi
Sakshi News home page

తుళ్లూరులో రాజధానిపై సుప్రీంకోర్టులో పిల్

Mar 17 2015 11:38 AM | Updated on Sep 2 2018 5:18 PM

తుళ్లూరులో రాజధానిపై సుప్రీంకోర్టులో పిల్ - Sakshi

తుళ్లూరులో రాజధానిపై సుప్రీంకోర్టులో పిల్

తుళ్లురులో చేపట్టనున్న ఏపీ రాజధానికి వ్యతిరేకంగా తాజాగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.

ఢిల్లీ: తుళ్లూరులో చేపట్టనున్నఏపీ రాజధానికి వ్యతిరేకంగా తాజాగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. పచ్చటి పొలాల భూములను రాజధాని భూసేకరణ కింద తీసుకోవడం మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విజయవాడ వాసి శ్రీమన్నారాయణ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. కృష్ణా తీరంలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

 

వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని సరికాదని తెలిపారు. దీనిపై ఈనెల 20 వ తేదీన విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పిల్ కు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement