ఆటో - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి | Person died in auto, tractor accident at Guntur district | Sakshi
Sakshi News home page

ఆటో - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి

Mar 7 2014 9:12 AM | Updated on Sep 2 2017 4:27 AM

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పుల్లమెరక వద్ద శుక్రవారం ఆటో - ట్రాక్టర్ ఢీ కొన్నాయి.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పుల్లమెరక వద్ద శుక్రవారం ఆటో - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వేళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి  పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement