పింఛను మాయం!

పింఛను మాయం!


 ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపడం కనికట్టులో ప్రత్యేకత. కానీ పింఛన్లలో కనికట్టు లేకపోయినా.. అదేం మాయో తెలియదు గానీ ఉన్నపళంగా అర్హులుగా ఉన్న పింఛన్‌దారులను ఒక్కసారిగా అనర్హత జాబితాలో చేర్చారు. కొందరికి భూమి లేకున్నా ఉన్నట్లు... వయస్సు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నట్లు... వికలాంగులుగా పుట్టినా అసలు వైకల్యమే లేనట్లు, ఇళ్లు లేకున్నా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో అర్హుల పేర్లు జాబితాల్లో లేకుండాపోతున్నారుు.

 

 సాక్షి, కడప / చింతకొమ్మదిన్నె :

 ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపడం కనికట్టులో ప్రత్యేకత. కానీ పింఛన్లలో కనికట్టు లేకపోయినా.. అదేం మాయో తెలియదు గానీ ఉన్నపళంగా అర్హులుగా ఉ్న పింఛన్‌దారులను ఒక్కసారిగా అనర్హత జాబితాలో చేర్చారు. కొందరికి భూమి లేకున్నా ఉన్నట్లు... వయస్సు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నట్లు... వికలాంగులుగా పుట్టినా అసలు వైకల్యమే లేనట్లు, ఇళ్లు లేకున్నా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో అర్హుల పేర్లు జాబితాల్లో లేకుండాపోతున్నారుు. తెలుగు తమ్ముళ్ల కమిటీలను ఆధారం చేసుకొని కొన్నింటిని తొలగిస్తే.. ఆన్‌లైన్ సిస్టమ్‌లో వచ్చిన మార్పుల ఫలితంగా మరికొన్ని పోతున్నాయంటూ అధికారులు చెబుతుండడంతో.. ఏం చేయాలో దిక్కు తెలియక లబ్ధిదారులు వేదనకు గురవుతున్నారు.



 జిల్లాలో 43 వేలకు పైగా

 పింఛన్ల తొలగింపు!

 రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కిన బాబు ప్రభుత్వం ఏ ఆసరాలేనివారికి ఇచ్చే సంక్షేమ పింఛన్లపై శీతకన్ను వేయడం దారుణం. వయసు తేడాలే కాకుండా రాజకీయ కక్షలతోనూ గ్రామాల్లో అర్హుల పింఛన్లకు కోతపెడుతోంది. జిల్లాలో వృద్ధులు, వికలాంగలు, వితంతువులు, అభయహస్తం తదితర వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 2,45,729 పింఛన్లు ఉండగా సామాజిక కమిటీల పేరుతో భారీగా కోత పెట్టారు.

కమిటీలో నిర్ణయించిన మేర జిల్లా వ్యాప్తంగా 14,838 పింఛన్లు తీసివేస్తే ఎస్‌ఆర్‌డీహెచ్‌తో అనుసంధానమైన తర్వాత మరో 28 వేల మంది పింఛన్లను రద్దు చేశారు. ప్రస్తుతం లక్షా 95వేల మందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తమకు ఎప్పటిలానే పింఛన్ వస్తుందని ఆశపడినవారంతా ఇప్పుడు కన్నీటిపర్యంతమవుతున్నారు.



 విచారణ నిర్వహిస్తున్నాం

 జిల్లాలో అర్హులకు జరిగిన అన్యాయాన్ని డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఁసాక్షి ప్రతినిధి* తీసుకెళ్లగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 14,900 మందికి సంబంధించిన పింఛన్లపై విచారణ చేయగా మరో 2,200 అర్హులుగా ఉన్నట్లు తేలాయని తెలిపారు. ఎస్‌ఆర్‌డీహెచ్ కింద తొలగించిన 28వేల పింఛన్లలో 14 వేల వరకు విచారణ పూర్తి చేశామని, అందులో 11,800 అర్హులుగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన స్పష్టంచేశారు. మిగతా వాటిపై త్వరితగతిన విచారణ పూర్తిచేసి అర్హులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top