are entitled
-
కేంద్రీయ విద్యాలయంలో తెల్లరేషన్ కార్డుదారులే అర్హులు
మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కేంద్రీయ విద్యాలయంలో దారిద్యరేఖకు దిగువనున్న విద్యార్థులే అర్హులని, ప్రవేశ సమయంలో తెల్ల రేషన్‌కార్డును పరిశీలించిన తరువాతే ప్రవేశ అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ కమిటీ చైర్మన్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కేంద్రీయ విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవేశ అనుమతుల నిబంధనలను చర్చించారు. రేషన్‌కార్డు స్థానంలో తహసీల్దార్లు జారీ చేసిన సర్టిఫికెట్‌ను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ ఎం సీతారామయ్య వివరించారు. దీంతో తహసీల్దార్లు ఎవ్వరు విద్యా ప్రవేశం కోసం సర్టిఫికెట్లు జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేయాలని ఏజేసీని ఆదేశించారు. కంప్యూటరీకరణ చేసిన కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ తెలుగుతల్లి విగ్రహం నుంచి కేంద్రీయ విద్యాలయం గేటు వరకు అప్రోచ్ రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. విద్యాలయ బడ్జెట్, అడ్మిషన్ల వివరాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏజేసీ శివశ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ ధనుంజయ, డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావు, ఏడీ విద్యాశాఖ మురళీకృష్ణ, కమిటీ సభ్యులు కృష్ణ, స్వప్న, అధ్యాపకులు మలహోత్రా తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్ర' గ్రహణం
నిరుపేదలు కష్టపడి నిర్మించుకున్న గృహాలకు, వివిధ నిర్మాణాల దశలో నిలిచిన వాటికి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడంలేదు. ఫలితంగా అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న వారు, ఎలాగోలా నిర్మించుకుందామనే వారికి బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అర్హులైనవేలాది మంది గృహాల మంజూరుకు ఎదురు చూస్తున్నారు. బిల్లుల చెల్లింపునకు, కొత్త గృహాల మంజూరుకు పట్టిన ‘చంద్ర’గ్రహణం ఎప్పుడు వీడుతుందోనని ఎదురు చూస్తున్నారు. కడప రూరల్ : జిల్లాలోని నిరుపేదలు కట్టుకున్న ఇంటికి, కట్టుకోబోతున్న వాటికి బిల్లులుమంజూరు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఫలితంగా వేలాది మంది నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే సొంతింటి కల ‘కల’గానే మిగిలిపోతుందని వాపోతున్నారు. గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో జిల్లాలో 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు జరిగిన రచ్చబండ ద్వారా గృహాల మంజూరు కోసం జిల్లా గృహ నిర్మాణసంస్థకు 1,43,848 మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 52,862మందిని అర్హులుగా గుర్తించారు. తర్వాత జరిగిన రచ్చబండ-2 ద్వారా 73,599 మంది దరఖాస్తు చేసుకోగా, 34546 మందిని అర్హులుగా గుర్తించారు. మొత్తం 2,17,448 దరఖాస్తులు రాగా, 87,408 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో 28,612 గృహాలను మంజూరు చేశారు. ఆ ప్రకారం 17,108 గృహాలు పూర్తి కాగా, 11,424 గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. రూ.72.48 కోట్ల మేరకు ఆగిన బిల్లులు దాదాపు రూ. 72.48 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ద్వారా బిల్లులను లబ్ధిదారులకు చెల్లించకుండా నిలుపుదల చేసింది. పూర్తయిన17,188 గృహాలలో 3987 మంది లబ్ధిదారులకు తక్షణమే రూ. 21.08 కోట్లను చెల్లించాల్సి ఉంది. అలాగే బిల్లులు మంజూరు కానందున వివిధ దశల్లో నిలిచిపోయిన 11424 గృహాలకు దాదాపు రూ.51.40 కోట్లు అందాల్సి ఉంది. అడకత్తెరలో 58,796 మంది అర్హులు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో వచ్చిన, అధికారులు గుర్తించిన మొత్తం 87,408 మంది అర్హుల జాబితాలో 58,796 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాడు కొత్త గృహాలను జీఓ 33, 44, 23 కింద మంజూరు చేసిన తరుణంలో ఎన్నికల కోడ్ వచ్చింది. అనంతరం ప్రభుత్వం మారింది. దీంతో కిరణ్ పాలనలో 58,796 మంది మిగిలారు. అలాగే అసంపూర్తిగా వివిధ నిర్మాణ దశల్లో 11,424 గృహాలు నిలిచిపోయాయి. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసిన 3987 మందికి ప్రభుత్వం బిల్లులను మంజూరు చేయలేదు. మే నెలలో ఆన్లైన్ నిలుపుదల ప్రభుత్వం గడిచిన మే నెల నుంచి ఆన్లైన్ పనులను నిలుపుదల చేసింది. ఫలితంగా బిల్లులు నిలిచిపోయాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇంటి నిర్మాణం, లబ్ధిదారుల వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఆన్లైన్ (వెబ్సైట్) వ్యవస్థ పనిచేస్తేగానీ లబ్ధిదారుల బిల్లులకు మోక్షం లభించదు. ప్రభుత్వం చొరవ చూపి అనుమతిస్తేనే అది సాధ్యపడుతుంది. ప్రభుత్వానికి పట్టని నిరుపేదల ‘గూడు’ గోడు గత ప్రభుత్వంలో కొత్త గృహాలకు అర్హులుగా మిగిలిన వారు, పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారు ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పాలకులు ఇంతవరకు ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఇంతవరకు కొత్తగా గృహాలను మంజూరు చేయకపోగా, గతంలోని వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుపేదల గూడు గోడు పట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో.. రచ్చబండకు వచ్చిన మొత్తం దరఖాస్తులు 2,17,448 అందులో అర్హులు 87,408 మంజూరు అయినవి 28,612 పూర్తయిన గృహాలు 17,188 నిర్మాణ దశల్లో నిలిచినవి 11,424 మొత్తం బిల్లుల చెల్లింపునకు అవసరం దాదాపుగా రూ.72.48 కోట్లు అంతుచిక్కని అర్హుల సంఖ్య 58,796 -
పింఛను మాయం!
ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపడం కనికట్టులో ప్రత్యేకత. కానీ పింఛన్లలో కనికట్టు లేకపోయినా.. అదేం మాయో తెలియదు గానీ ఉన్నపళంగా అర్హులుగా ఉన్న పింఛన్‌దారులను ఒక్కసారిగా అనర్హత జాబితాలో చేర్చారు. కొందరికి భూమి లేకున్నా ఉన్నట్లు... వయస్సు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నట్లు... వికలాంగులుగా పుట్టినా అసలు వైకల్యమే లేనట్లు, ఇళ్లు లేకున్నా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో అర్హుల పేర్లు జాబితాల్లో లేకుండాపోతున్నారుు. సాక్షి, కడప / చింతకొమ్మదిన్నె : ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపడం కనికట్టులో ప్రత్యేకత. కానీ పింఛన్లలో కనికట్టు లేకపోయినా.. అదేం మాయో తెలియదు గానీ ఉన్నపళంగా అర్హులుగా ఉ్న పింఛన్‌దారులను ఒక్కసారిగా అనర్హత జాబితాలో చేర్చారు. కొందరికి భూమి లేకున్నా ఉన్నట్లు... వయస్సు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నట్లు... వికలాంగులుగా పుట్టినా అసలు వైకల్యమే లేనట్లు, ఇళ్లు లేకున్నా ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడంతో అర్హుల పేర్లు జాబితాల్లో లేకుండాపోతున్నారుు. తెలుగు తమ్ముళ్ల కమిటీలను ఆధారం చేసుకొని కొన్నింటిని తొలగిస్తే.. ఆన్లైన్ సిస్టమ్‌లో వచ్చిన మార్పుల ఫలితంగా మరికొన్ని పోతున్నాయంటూ అధికారులు చెబుతుండడంతో.. ఏం చేయాలో దిక్కు తెలియక లబ్ధిదారులు వేదనకు గురవుతున్నారు. జిల్లాలో 43 వేలకు పైగా పింఛన్ల తొలగింపు! రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కిన బాబు ప్రభుత్వం ఏ ఆసరాలేనివారికి ఇచ్చే సంక్షేమ పింఛన్లపై శీతకన్ను వేయడం దారుణం. వయసు తేడాలే కాకుండా రాజకీయ కక్షలతోనూ గ్రామాల్లో అర్హుల పింఛన్లకు కోతపెడుతోంది. జిల్లాలో వృద్ధులు, వికలాంగలు, వితంతువులు, అభయహస్తం తదితర వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 2,45,729 పింఛన్లు ఉండగా సామాజిక కమిటీల పేరుతో భారీగా కోత పెట్టారు. కమిటీలో నిర్ణయించిన మేర జిల్లా వ్యాప్తంగా 14,838 పింఛన్లు తీసివేస్తే ఎస్ఆర్డీహెచ్తో అనుసంధానమైన తర్వాత మరో 28 వేల మంది పింఛన్లను రద్దు చేశారు. ప్రస్తుతం లక్షా 95వేల మందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తమకు ఎప్పటిలానే పింఛన్ వస్తుందని ఆశపడినవారంతా ఇప్పుడు కన్నీటిపర్యంతమవుతున్నారు. విచారణ నిర్వహిస్తున్నాం జిల్లాలో అర్హులకు జరిగిన అన్యాయాన్ని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఁసాక్షి ప్రతినిధి* తీసుకెళ్లగా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 14,900 మందికి సంబంధించిన పింఛన్లపై విచారణ చేయగా మరో 2,200 అర్హులుగా ఉన్నట్లు తేలాయని తెలిపారు. ఎస్ఆర్డీహెచ్ కింద తొలగించిన 28వేల పింఛన్లలో 14 వేల వరకు విచారణ పూర్తి చేశామని, అందులో 11,800 అర్హులుగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన స్పష్టంచేశారు. మిగతా వాటిపై త్వరితగతిన విచారణ పూర్తిచేసి అర్హులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.