కేంద్రీయ విద్యాలయంలో తెల్లరేషన్‌ కార్డుదారులే అర్హులు | The central campus card are entitled to tellaresan | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయంలో తెల్లరేషన్‌ కార్డుదారులే అర్హులు

Aug 24 2016 10:32 PM | Updated on Sep 4 2017 10:43 AM

:మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

:మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

కేంద్రీయ విద్యాలయంలో దారిద్యరేఖకు దిగువనున్న విద్యార్థులే అర్హులని, ప్రవేశ సమయంలో తెల్ల రేషన్‌కార్డును పరిశీలించిన తరువాతే ప్రవేశ అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ కమిటీ చైర్మన్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అన్నారు.

  • మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: కేంద్రీయ విద్యాలయంలో దారిద్యరేఖకు దిగువనున్న విద్యార్థులే అర్హులని, ప్రవేశ సమయంలో తెల్ల రేషన్‌కార్డును పరిశీలించిన తరువాతే ప్రవేశ అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ కమిటీ చైర్మన్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కేంద్రీయ విద్యాలయ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రవేశ అనుమతుల నిబంధనలను చర్చించారు.   రేషన్‌కార్డు స్థానంలో తహసీల్దార్‌లు జారీ చేసిన సర్టిఫికెట్‌ను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్‌ ఎం సీతారామయ్య వివరించారు. దీంతో తహసీల్దార్‌లు ఎవ్వరు విద్యా ప్రవేశం కోసం సర్టిఫికెట్‌లు జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేయాలని ఏజేసీని ఆదేశించారు. కంప్యూటరీకరణ చేసిన కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్‌లు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ తెలుగుతల్లి విగ్రహం నుంచి కేంద్రీయ విద్యాలయం గేటు వరకు అప్రోచ్‌ రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. విద్యాలయ బడ్జెట్, అడ్మిషన్‌ల వివరాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏజేసీ శివశ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ ధనుంజయ, డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్‌రావు, ఏడీ విద్యాశాఖ మురళీకృష్ణ, కమిటీ సభ్యులు కృష్ణ, స్వప్న, అధ్యాపకులు మలహోత్రా తదితరులు పాల్గొన్నారు.


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement