breaking news
campus card
-
కేంద్రీయ విద్యాలయంలో తెల్లరేషన్ కార్డుదారులే అర్హులు
మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: కేంద్రీయ విద్యాలయంలో దారిద్యరేఖకు దిగువనున్న విద్యార్థులే అర్హులని, ప్రవేశ సమయంలో తెల్ల రేషన్‌కార్డును పరిశీలించిన తరువాతే ప్రవేశ అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ కమిటీ చైర్మన్ డీఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కేంద్రీయ విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవేశ అనుమతుల నిబంధనలను చర్చించారు. రేషన్‌కార్డు స్థానంలో తహసీల్దార్లు జారీ చేసిన సర్టిఫికెట్‌ను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ ఎం సీతారామయ్య వివరించారు. దీంతో తహసీల్దార్లు ఎవ్వరు విద్యా ప్రవేశం కోసం సర్టిఫికెట్లు జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేయాలని ఏజేసీని ఆదేశించారు. కంప్యూటరీకరణ చేసిన కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ తెలుగుతల్లి విగ్రహం నుంచి కేంద్రీయ విద్యాలయం గేటు వరకు అప్రోచ్ రోడ్డు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. విద్యాలయ బడ్జెట్, అడ్మిషన్ల వివరాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏజేసీ శివశ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ ధనుంజయ, డీఎంఅండ్‌హెచ్‌ఓ కొండల్రావు, ఏడీ విద్యాశాఖ మురళీకృష్ణ, కమిటీ సభ్యులు కృష్ణ, స్వప్న, అధ్యాపకులు మలహోత్రా తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఐసెట్
సాక్షి, సిటీబ్యూరో : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసిం ది. గ్రేటర్లో 59 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ముందస్తుగా చెప్పినట్లే నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు. అభ్యర్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ, వెస్లీ డిగ్రీ కళాశాలల్లో ఈ పరీక్షకు కూడా నిమిషం నిబంధన వి ధించడంతో విద్యార్థులందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. 89 శాతం మంది హాజరు ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్ రిజియన్లో ఏర్పాటు చేసిన 59 పరీక్షా కేంద్రాలలో 89 శాతం అభ్యర్థులు హాజరైన్నట్లు కోఆర్డినేటర్ ప్రొ.కృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాలల్లో ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదన్నారు. ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ, బర్కత్‌పుర అంబేద్కర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను వీసీ ప్రొ.సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొ.ప్రతాప్‌రెడ్డి సందర్శించారు.