ప్రశాంతంగా ఐసెట్ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఐసెట్

Published Sat, May 24 2014 4:36 AM

ప్రశాంతంగా ఐసెట్ - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్-2014 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా ముగిసిం ది. గ్రేటర్‌లో 59 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ముందస్తుగా చెప్పినట్లే నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు. అభ్యర్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
 
రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ, వెస్లీ డిగ్రీ కళాశాలల్లో ఈ పరీక్షకు కూడా నిమిషం నిబంధన వి ధించడంతో విద్యార్థులందరూ గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.
 
89 శాతం మంది హాజరు
 
ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్  రిజియన్‌లో ఏర్పాటు చేసిన 59 పరీక్షా కేంద్రాలలో 89 శాతం అభ్యర్థులు హాజరైన్నట్లు కోఆర్డినేటర్ ప్రొ.కృష్ణారెడ్డి తెలిపారు. కొన్ని పరీక్షా కేంద్రాలల్లో ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదన్నారు. ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్రమహిళా సభ, బర్కత్‌పుర అంబేద్కర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను వీసీ ప్రొ.సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రొ.ప్రతాప్‌రెడ్డి సందర్శించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement