ప్రపంచంలోనే టాప్‌ 5 బిజినెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఐఎస్‌బీకి చోటు | ISB Ranked 5 On LinkedIn 2025 Top 20 MBA List, Checkout LinkedIn MBA Rankings Details | Sakshi
Sakshi News home page

LinkedIn MBA Rankings: ప్రపంచంలోనే టాప్‌ 5 బిజినెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఐఎస్‌బీకి చోటు

Sep 17 2025 9:59 AM | Updated on Sep 17 2025 10:36 AM

ISB Ranked 5 on LinkedIn 2025 Top MBA List

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లింక్డ్ఇన్ 2025 టాప్ ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత సంవత్సరం ఆరో స్థానం నుంచి పుంజుకుంది. టాప్ 100 గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ల జాబితాలో ప్రతిష్టాత్మకంగా టాప్ 20లో మూడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు చోటు సంపాదించాయి. అందులో ఐఐఎం-కలకత్తా (16వ స్థానం), ఐఐఎం-అహ్మదాబాద్ (17), ఐఐఎం-బెంగళూరు (20) ఉన్నాయి.

ఈ సందర్భంగా లింక్డ్ఇన్ ఇండియా, సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ నిపుణులు నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ..‘విద్యార్థులు ఎంబీఏను ఎంచుకోవడం తమ కెరియర్‌లో కీలకంగా ఉంటుంది. ఎంబీఏ ద్వారా వచ్చే విశ్వాసం, అవకాశాలు దశాబ్దాలపాటు తమ కెరియర్‌ వృద్ధికి ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, ప్రొఫెసర్ మదన్ పిలుట్ల మాట్లాడుతూ..‘ఐఎస్‌బీలో పీజీపీ నైపుణ్యాలను అందించడమే కాకుండా, మారుతున్న ప్రపంచంలో వృద్ధి చెందడానికి అవసరమైన మెలకువలు నేర్పుతున్నాం’ అన్నారు.

ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’

లింక్డ్ఇన్ టాప్ ఎంబీఏ 2025 ర్యాంకింగ్స్‌ జాబితా కింది విధంగా ఉంది.

  1. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం

  2. హార్వర్డ్ విశ్వవిద్యాలయం

  3. ఇన్ సీడ్

  4. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం

  5. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

  6. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం

  7. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (MIT)

  8. డార్ట్ మౌత్ కాలేజ్‌

  9. కొలంబియా విశ్వవిద్యాలయం

  10. లండన్ విశ్వవిద్యాలయం

  11. చికాగో విశ్వవిద్యాలయం

  12. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

  13. డ్యూక్ విశ్వవిద్యాలయం

  14. యేల్ విశ్వవిద్యాలయం

  15. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ

  16. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - కలకత్తా

  17. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - అహ్మదాబాద్

  18. వర్జీనియా విశ్వవిద్యాలయం

  19. కార్నెల్ విశ్వవిద్యాలయం

  20. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement