‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’ | Indian Youth Earns ₹1 Crore in 2 Years by Developing 5 Apps While Working Full-Time | Sakshi
Sakshi News home page

‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’

Sep 17 2025 9:23 AM | Updated on Sep 17 2025 11:48 AM

college student coding hobby into Rs 1 crore app venture

జీవితంలో ఎదగాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కొందరు నిరూపిస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ కాలంలో కాలేజీ రోజుల్లో నుంచే కోడింగ్‌పై ఆసక్తి పెంచుకొని, ఓవైపు పగటిపూట ఉద్యోగం చేస్తూనే మరోవైపు రాత్రిళ్లు డిజిటల్‌ యాప్స్‌ తయారు చేశాడు ఓ యువకుడు. ఆ యాప్స్‌కు నెటిజన్లు నుంచి ఆదరణ లభించడంతో రెండేళ్లలోనే ఏకంగా రూ.1 కోటి సంపాదించాడు. ఈమేరకు ఆ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

రెడ్డిట్‌లో ఇండియన్‌ ఫ్లెక్స్‌ హ్యాండిల్‌లో చేసిన పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను 2015లో కాలేజీలో చేరాను. మొదటి నుంచే నాకు కోడింగ్‌పై ఆసక్తి పెరిగింది. అందులోని మెలకువలు నేర్చుకున్నాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ఓ రిటైల్‌ కంపెనీలో పగలు ఉద్యోగం చేసేవాడిని. కోడింగ్‌ నైపుణ్యాలతో రాత్రిళ్లు పనిచేస్తూ కొన్ని యాప్స్‌ డెవలప్‌ చేశాను. మొత్తంగా 5 డిజిటల్స్‌ యాప్స్‌ ఆవిష్కరించాను. వీటి అభివృద్ధికి ఎవరి సాయం తీసుకోలేదు. నేనే కోడింగ్‌, డిజైనింగ్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌.. వంటివి చేసుకున్నాను. దాంతో రెండేళ్లలో రూ.1 కోటి సంపాదించాను’ అని రాసుకొచ్చారు.

మనం చేసే పనిలో ఆసక్తి, పట్టుదల, నైపుణ్యాలు పెంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దాంతో క్రమంగా ఆర్థిక భరోసా ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్‌ పాస్‌పోర్ట్‌ చిప్‌లపై పరిశోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement