
ఎల్‌అండ్‌టీ సెమీకండక్టర్, సీ–డాక్, ఐఐటీ గాందీనగర్ జట్టు
దేశీయంగా సురక్షితమైన చిప్‌లను డిజైన్ చేసే దిశగా ఎల్‌అండ్‌టీ సెమీకండక్టర్ టెక్నాలజీస్ (ఎల్‌టీఎస్‌సీటీ), సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ–డాక్), ఐఐటీ గాందీనగర్ జట్టు కట్టాయి. ప్రాథమికంగా ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టుల కోసం చిప్‌లపై (ఐసీ) పరిశోధనలు జరపడం, వాటిని అభివృద్ధి, తయారు చేయడంపై ఈ మూడూ కలిసి పని చేస్తాయి.
ఇందుకోసం ప్రత్యేకంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు నిర్దిష్టంగా ఇన్వెస్ట్ చేయనున్నాయి. సున్నితమైన విభాగాల్లో విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. కొత్త తరం క్రిప్టో ప్రోడక్టులకు కూడా సెక్యూర్ ఐసీ సొల్యూషన్ పునాదులు వేస్తుందని ఎల్‌టీఎస్‌సీటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సందీప్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్.. 10 లక్షల మైలురాయి