breaking news
CDAC
-
సీడ్యాక్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డ్యాక్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 44 ► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్–03, ప్రాజెక్ట్ ఇంజనీర్–39, ప్రాజెక్ట్ ఆఫీసర్–02. ► ప్రాజెక్ట్ మేనేజర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.64,000–రూ.89,000 చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ ఇంజనీర్: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:24.05.2021 ► వెబ్సైట్: https://www.cdac.in/index.aspx?id=current_jobs CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు -
సీడ్యాక్, నోయిడాలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ–డ్యాక్), నోయిడా యూనిట్.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 72 » పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ మేనేజర్–08, ప్రాజెక్ట్ ఇంజనీర్–64, » ప్రాజెక్ట్ మేనేజర్: విభాగాలు–ఖాళీలు: సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్–04, సొల్యూషన్ ఆర్కిటెక్ట్–04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ ఎంఈ/ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. » ప్రాజెక్ట్ ఇంజనీర్: విభాగాలు–ఖాళీలు: సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్–10,సాఫ్ట్వేర్ డెవలపర్–50, మొబైల్ అప్లికేషన్ డెవలపర్–04. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ఎంసీఏ/పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్/ఐటీ/కంప్యూటర్ అప్లికేషన్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 31.12.2020 నాటికి 37 ఏళ్లు మించకూడదు. » ఎంపిక విధానం: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.02.2021 » వెబ్సైట్: https://www.cdac.in/ సీఎస్ఐఆర్–సీడీఆర్ఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు లక్నోలోని సీఎస్ఐఆర్–సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీడీఆర్ఐ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 07 » పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్–04, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–02. » ప్రాజెక్ట్ అసిస్టెంట్: అర్హత: లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు. స్టయిపండ్: నెలకు రూ.20,000 + హెచఆర్‌ఏ చెల్లిస్తారు. » ప్రాజెక్ట్ అసోసియేట్: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. వేతనం ప్రాజెక్ట్ అసోసియేట్–1కు నెలకు రూ.31,000, ప్రాజెక్ట్ అసోసియేట్–2: నెలకు రూ.35,000 చెల్లిస్తారు. » సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: అర్హత: బీసీఏ, బీటెక్(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.18,000 + హెచ్ఆర్ఏ చెల్లిస్తారు. » ఎంపిక విధానం: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.02.2021 » వెబ్సైట్: https://cdri.res.in/ సీఎన్‌సీఐ, కోల్‌కతాలో వివిధ ఖాళీలు కోల్‌కతాలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(సీఎన్‌సీఐ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 152 » పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ గ్రేడ్–1–14, స్పెషలిస్ట్ గ్రేడ్–2– 32, స్టాఫ్ నర్సు–106. » స్పెషలిస్ట్ గ్రేడ్–1: వయసు: 50 ఏళ్లు మించకూడదు. » స్పెషలిస్ట్ గ్రేడ్–2: వయసు: 45 ఏళ్లు మించకూడదు. » స్టాఫ్ నర్సు: వయసు: 35 ఏళ్లు మించకూడదు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 19.02.2021 » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 » వెబ్సైట్: https://www.cnci.ac.in/ -
వచ్చే ఏడాదిలోగా స్వదేశీ సూపర్ కంప్యూటర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలోగా కేంద్రం.. సూపర్ కంప్యూటర్ను దేశంలో ప్రతిష్టాత్మక సంస్థలకు అందించనుంది. దేశ తొలి సూపర్ కంప్యూటర్ ‘పరమ్’ను తయారు చేసిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌కు ఈ ప్రాజెక్టు బాధ్యతల అప్పగించారు. సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద రూ. 4,500 కోట్లు కేటాయించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది.