సీడ్యాక్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు | CDAC Hyderabad Recruitment 2021: Project Manager, Project Officer and Project Engineer Vacancies | Sakshi
Sakshi News home page

సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

May 11 2021 4:05 PM | Updated on May 11 2021 4:07 PM

CDAC Hyderabad Recruitment 2021: Project Manager, Project Officer and Project Engineer Vacancies - Sakshi

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 44
► పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌–03, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–39, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌–02.

ప్రాజెక్ట్‌ మేనేజర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.64,000–రూ.89,000 చెల్లిస్తారు.

ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌: అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, వివిధ టెక్నికల్‌ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. వయసు: దరఖాస్తు  చేసే నాటికి 50 ఏళ్లు మించకుండా ఉండాలి. వేతనం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:24.05.2021
► వెబ్‌సైట్‌: https://www.cdac.in/index.aspx?id=current_jobs

CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

Advertisement
 
Advertisement
Advertisement