
ప్రపంచపు అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్ (LinkedIn).. 2025 లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా జాబితాను (2025 LinkedIn Top Startups India List) ప్రకటించింది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగ ఆసక్తి, ఎంగేజ్‌మెంట్, అగ్రశ్రేణి ప్రతిభ ఆకర్షణ వంటి సూచకాలపై ఆధారపడి రూపొందించిన ఈ జాబితా.. వేగంగా ఎదుగుతున్న, అభివృద్ధికి అనుకూలమైన స్టార్టప్‌లను హైలైట్ చేస్తుంది.
అగ్రస్థానాల్లో నిలిచిన స్టార్టప్స్
క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో (Zepto) వరుసగా మూడవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ స్టోరేజ్ సంస్థ లూసిడిటీ రెండో స్థానంలో, బెంగళూరుకు చెందిన 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే ప్లాట్‌ఫామ్ స్విష్ మూడో స్థానాన్ని పొందాయి. ఈ సంస్థలు విభిన్న రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, వేగవంతమైన వృద్ధి, టెక్నాలజీలో లోతు, కేటగిరీ సృష్టిలో చురుకుదనంతో నిలిచాయి.
ప్రాంతీయ ప్రాముఖ్యత
బెంగళూరుకు చెందిన 9 స్టార్టప్స్ టాప్ 20లో చోటు దక్కించుకోగా, ఢిల్లీ, ముంబై ఆధారిత అంకుర సంస్థలు చెరో 2 జాబితాలో చేరాయి. ఇక పుణె(EMotorad), హైదరాబాద్ (Bhanzu) వంటి నగరాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.
2025 టాప్ 20 స్టార్టప్స్ జాబితా |
---|
జెప్టో |
స్విష్ |
వీక్డే |
జార్ |
కాన్విన్ |
భాన్జు |
రిఫైన్ ఇండియా |
ఈమోటోరాడ్ |
అట్లిస్ |
ఇంటర్వ్యూ.ఐఓ |
బ్లిస్ క్లబ్ |
ఫస్ట్ క్లబ్ |
స్నాబిట్ |
గోక్విక్ |
డెజెర్వ్ |
న్యూమె |
కార్డు 91 |
లైమ్ చాట్ |
యాప్స్ ఫర్ భారత్ |
ఉద్యోగ అవకాశాల కోసం చిట్కాలు
ఈ జాబితా యువతకు కెరీర్ ఎంపికల్లో స్పష్టతనిచ్చే గైడ్‌గా నిలుస్తోంది. వేగంగా ఎదుగుతున్న సంస్థలను ఎలా ఎంచుకోవాలో, వాటిలో ఎలా ఉద్యోగం పొందాలో కొన్ని చిట్కాలను లింక్డ్ఇన్ ఇండియా సీనియర్ ఎడిటర్ నిరజితా బెనర్జీ అందించారు. అవి..
* స్టార్టప్ స్కేలింగ్ ట్రెండ్‌లను గమనించండి
* వ్యవస్థాపకుల పట్ల విశ్వాసం, వ్యూహాలను పరిశీలించండి
* ఆవిష్కరణతో పాటు కార్యాచరణలో నైపుణ్యం ఉన్న కంపెనీలను ఎంచుకోండి
* మార్కెట్ విస్తరణ, ప్రొడక్ట్-మార్కెట్ ఫిట్‌ను అంచనా వేయండి