breaking news
ISB campus
-
ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఐఎస్బీకి చోటు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లింక్డ్ఇన్ 2025 టాప్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్ల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత సంవత్సరం ఆరో స్థానం నుంచి పుంజుకుంది. టాప్ 100 గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్‌ల జాబితాలో ప్రతిష్టాత్మకంగా టాప్ 20లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు చోటు సంపాదించాయి. అందులో ఐఐఎం-కలకత్తా (16వ స్థానం), ఐఐఎం-అహ్మదాబాద్ (17), ఐఐఎం-బెంగళూరు (20) ఉన్నాయి.ఈ సందర్భంగా లింక్డ్ఇన్ ఇండియా, సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ నిపుణులు నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ..‘విద్యార్థులు ఎంబీఏను ఎంచుకోవడం తమ కెరియర్లో కీలకంగా ఉంటుంది. ఎంబీఏ ద్వారా వచ్చే విశ్వాసం, అవకాశాలు దశాబ్దాలపాటు తమ కెరియర్ వృద్ధికి ఎంతో తోడ్పడుతాయి’ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్, ప్రొఫెసర్ మదన్ పిలుట్ల మాట్లాడుతూ..‘ఐఎస్బీలో పీజీపీ నైపుణ్యాలను అందించడమే కాకుండా, మారుతున్న ప్రపంచంలో వృద్ధి చెందడానికి అవసరమైన మెలకువలు నేర్పుతున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’లింక్డ్ఇన్ టాప్ ఎంబీఏ 2025 ర్యాంకింగ్స్ జాబితా కింది విధంగా ఉంది.స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంహార్వర్డ్ విశ్వవిద్యాలయంఇన్ సీడ్పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంమసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)డార్ట్ మౌత్ కాలేజ్కొలంబియా విశ్వవిద్యాలయంలండన్ విశ్వవిద్యాలయంచికాగో విశ్వవిద్యాలయంఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయండ్యూక్ విశ్వవిద్యాలయంయేల్ విశ్వవిద్యాలయంకాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కలకత్తాఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహ్మదాబాద్వర్జీనియా విశ్వవిద్యాలయంకార్నెల్ విశ్వవిద్యాలయంఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - బెంగళూరు -
ఐఎస్బీలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న, వర్ధమాన దేశాల్లో ఇన్వెస్టింగ్ తీరుతెన్నుల గురించి అవగాహన పెంచే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో ట్రేడింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఎండీ చిత్రా రామకృష్ణ బుధవారం ఇక్కడ దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా మారుతున్న ట్రేడింగ్ తీరుతెన్నులు, సంపన్న దేశాల్లో పాటిస్తున్న విధానాలు, వర్ధమాన దేశాల్లో విధానాలు మొదలైన వాటిని అధ్యయనం చేసేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడగలదని ఈ సందర్భంగా చిత్రా తెలిపారు. బిజినెస్ స్కూల్స్‌తో ఎన్ఎస్ఈ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే ప్రథమం అని ఆమె చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ల్యాబ్‌లో 34 ట్రేడింగ్ టెర్మినల్స్ ఉన్నాయని ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్, థామ్సన్ రాయిటర్స్ వంటి ప్రీమియం బిజినెస్ సంస్థల డేటాబేస్లు కూడా వారికి అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఈ ల్యాబ్ తోడ్పడగలదని రంగ్నేకర్ వివరించారు.