విధేయతకే అందలం | pathivada narayana swamy tdp Cabinet Chance | Sakshi
Sakshi News home page

విధేయతకే అందలం

Jun 8 2014 2:40 AM | Updated on Aug 10 2018 8:08 PM

విధేయతకే అందలం - Sakshi

విధేయతకే అందలం

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆదివారం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆదివారం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు క్యాబినెట్ మంత్రులు ప్రమాణం స్వీకారం చేస్తారు. అందులో జిల్లా నుంచి ఒకే ఒక్కరికి అవకాశం లభించింది. ఆ అదృష్టం జిల్లాలో సీనియర్ నేత, పార్టీ విధేయునిగా పేరుపొందిన పతివాడ నారాయణ స్వామి తలుపుతట్టింది. ఈ మేరకు అధినేత నుంచి   శనివారం రాత్రి సమాచారం అందినట్టు తెలిసింది.    వాస్తవానికైతే జిల్లా నుంచి ప్రధానంగా ఇద్దరు నేతలు మంత్రి పదవులను ఆశించారు. అందులో ఒకరు పతివాడ నారాయణస్వామినాయుడు, మరొకరు కోళ్ల లలితకుమారి.

ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ సీనియర్ నేతగా, గతంలో చక్కెర, ఉద్యానవన శాఖామంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా పతివాడకే మంత్రి పదవి దక్కింది. పార్టీ ఆవి ర్భావం నుంచి ఆయన విధేయుడిగా ఉండడం కూడా రెండోసారి మంత్రి కావడానికి దోహదపడింది.మరో నేత కోళ్ల లలితకుమారి  రెండుసార్లు ఎన్నికవడమే కాకుండా ఆ పార్టీ సీనియర్ నే త కోళ్ల అప్పలనాయుడి రాజకీయ వా రసురాలు కావడంతో రేసులోకి వచ్చా రు. అయితే ఆమెకు మంత్రి వర్గ విస్తర ణలో పదవిదక్కొచ్చని భావిస్తున్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement