ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్ | Para-cyclist to six hours, the TTD | Sakshi
Sakshi News home page

ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్

Sep 10 2015 2:00 AM | Updated on Sep 3 2017 9:04 AM

ఆరు గంటల్లో  తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్

ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్

ప్రముఖ పారా సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండెక్కారు.

తిరుమల: ప్రముఖ పారా సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండెక్కారు. 9 కిలోమీటర్ల ఈ మార్గంలోని మొత్తం 3,300 మెట్లను తన కృత్రిమ కాలుతో ఎక్కారు. అలిపిరి వద్ద ఉదయం 10.45 గంటలకు నడక ప్రారంభించిన ఆదిత్యా సాయంత్రం 4.45 గంటలకు తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆదిత్యా మెహతా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఒంటి కాలితో పారా సైక్లింగ్ విజయవంతం కావడంతో శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు వచ్చానన్నారు. పారా సైక్లింగ్ ద్వారా క్రీడారంగానికి చేయూతనివ్వాలని తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement