'ప్రపంచంలో పెద్ద మూర్ఖుడు కిరణే.. ఛీ కొడుతున్నారు' | Palwai Govardhan Reddy lashes out at kirankumar Reddy | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలో పెద్ద మూర్ఖుడు కిరణే.. ఛీ కొడుతున్నారు'

Jan 28 2014 5:57 PM | Updated on Jul 29 2019 5:28 PM

'ప్రపంచంలో పెద్ద మూర్ఖుడు కిరణే.. ఛీ కొడుతున్నారు' - Sakshi

'ప్రపంచంలో పెద్ద మూర్ఖుడు కిరణే.. ఛీ కొడుతున్నారు'

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి.. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన రెడ్డి.. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖుడు కిరణేనని విమర్శించారు. సీఎం తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర విభజన ఆగదని, ఆయన్ను అందరూ ఛీ కొడుతున్నారంటూ పాల్వాయి రెచ్చిపోయారు.

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 15 కల్లా నోటిఫికేషన్‌ రాబోతోందని పాల్వాయి చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నెల 30 కల్లా తెలంగాణ బిల్లు కేంద్రానికి చేరుతుందని పాల్వాయి గోవర్ధన రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement