తాతమనవళ్లపైకి దూసుకెళ్లిన లారీ | one killed and one injured in road accident in prakasam district | Sakshi
Sakshi News home page

తాతమనవళ్లపైకి దూసుకెళ్లిన లారీ

Jul 1 2016 7:50 AM | Updated on Aug 30 2018 4:07 PM

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది

ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద శుక్రవారం లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న తాతా,మనవడి మీదుకు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా... తాత తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement