విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి | One dies due to Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

Jun 26 2015 3:11 PM | Updated on Sep 3 2017 4:25 AM

విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి కరెంట్‌షాక్‌తో మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు.

తిరుపతి (చిత్తూరు) : తిరుపతిలో శుక్రవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి కరెంట్‌షాక్‌తో మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో స్థానిక లైన్‌మెన్‌లు జగదీశ్వర్‌రెడ్డి, మురళి శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ తీగలు సరి చేస్తున్నారు. వారు మరమ్మత్తులు చేస్తున్న లైన్‌లో విద్యుత్ ప్రసారం ఆపేశారు కూడా.

అయితే గతంలో అదే మార్గంలో వేసిన మరో లైనులో విద్యుత్ ప్రసారం అవుతోంది. కానీ ఈ విషయం తెలియక మరమ్మత్తు చేస్తున్న జగదీశ్వర్‌రెడ్డి షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందగా మురళికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement