టిప్పర్, బైక్ ఢీ : ఒకరి మృతి | One died and One injured in road accident | Sakshi
Sakshi News home page

టిప్పర్, బైక్ ఢీ : ఒకరి మృతి

Aug 4 2015 4:02 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది.

లేపాక్షి (అనంతపురం జిల్లా) : వేగంగా వెళ్తున్న టిప్పర్ లారీ రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామం సమీపంలోని రోడ్డు క్రాస్ వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని కలిబిపల్లి గ్రామానికి చెందిన రాము(35), కిష్టయ్య అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై లేపాక్షి వెళ్తున్నారు.

కాగా మార్గ మధ్యంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను టిప్పర్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాము  మృతి చెందాడు. కిష్టయ్య ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement