దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి | One dead and one injured in road accident | Sakshi
Sakshi News home page

దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి

Oct 30 2015 7:29 PM | Updated on Aug 30 2018 3:56 PM

దత్తిరాజేరు మండలం చౌడంతివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది.

దత్తిరాజేరు (విజయనగరం) : దత్తిరాజేరు మండలం చౌడంతివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య గొల్లు రమణమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందగా..భర్తకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement