మంచినీరు అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి | One and half year old baby drinks Pesticides | Sakshi
Sakshi News home page

మంచినీరు అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి

Dec 7 2015 8:25 PM | Updated on Sep 3 2017 1:38 PM

మంచినీరు అనుకుని ఓ చిన్నారి పురుగు మందు తాగి మృత్యువాతపడింది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపాడులో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

రెంటచింతల (గుంటూరు) : మంచినీరు అనుకుని ఓ చిన్నారి పురుగు మందు తాగి మృత్యువాతపడింది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపాడులో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్మన్‌నాయక్, రోజా బాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. సోమవారం సాయంత్రం పొలానికి వెళ్తూ తమ చిన్నారి సంధ్య(ఏడాదిన్నర)ను వెంట తీసుకెళ్లారు.

పొలం గట్టున చిన్నారిని నిద్రపుచ్చిన ఆ దంపతులు పురుగు మందు పిచికారీ చేయటంలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన చిన్నారి... దాహం వేయటంలో పక్కనే ఉన్న పురుగు మందును మంచినీళ్లుగా భావించి తాగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే సంధ్య చనిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement