భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం! | Visakha Express Case: Woman Complaint Rape Against Unknown Person | Sakshi
Sakshi News home page

భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం!

Apr 29 2026 8:40 AM | Updated on Apr 29 2026 10:18 AM

Visakha Express Case: Woman Complaint Rape Against Unknown Person

సాక్షి, పల్నాడు: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటల్ని నమ్మి బాధిత దంపతులు వెంట వెళ్లగా..  ఏసీ బోగీలోకి తీసుకెళ్లి మరీ వివాహితపై అఘాయిత్యం జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జరిగిన వివరాల్లోకి వెళ్తే.. 

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖలో నివాసం ఉంటున్నారు. జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. ఈలోపు జనరల్‌ బోగీలో ఉన్న ఆ జంట వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడతారని?.. ఏసీ బోసీలో ఖాళీగా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని వాళ్లు వెంట వెళ్లారు. 

అయితే ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భర్త టాయ్‌లెట్‌ వద్ద కూర్చోనిపోయాడు. మహిళను హెచ్‌1ఏ బోగీలోకి తీసేకెళ్లి కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ ఘటనపై బాధితురాలు రెంటచింతల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే ఓలీసులు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement