షర్మిలయాత్రకు ఎన్నారై నేతల మద్దతు | NRIs Solidarity to Sharmila Bus Yatra | Sakshi
Sakshi News home page

షర్మిలయాత్రకు ఎన్నారై నేతల మద్దతు

Sep 10 2013 10:21 PM | Updated on Sep 1 2017 10:36 PM

సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి పార్టీ ఎన్నారై విభాగం నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి పార్టీ ఎన్నారై విభాగం నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు. సోమవారం అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో నేతలంతా పెద్ద ఎత్తున సమావేశమయ్యారు.

రాష్ట్రం సమైక్యత కోసం షర్మిల చేస్తున్న కృషి హర్షించదగినదని, ఆమె తలపెట్టిన యాత్రకు సంఘీభావం తెల్పుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.రత్నాకర్, కృష్ణమోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్బాబు, జితేందర్ రెడ్డి, సి. శ్రీధర్, పి. జగన్మోహన్, గోపాల్ సుబ్బయ్య, సురేష్రెడ్డి, భక్తలియార్ఖాన్, విజయ్రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement