
'పవన్ కల్యాణ్ పార్టీపై స్పందించం'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ నిరాకరించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ నిరాకరించారు. పవన్ కల్యాణ్ పార్టీపై స్పందించనని కరాకండిగా చెప్పారు.తెలంగాణ,సీమాంధ్ర రాష్ట్రాలలో బీజేపీ వివిధ పార్టీలతో పొత్తులపై ఇరు ప్రాంతాల నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఆయన హైదరాబాద్లో సమావేశమై చర్చించారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. పవన్ స్థాపించిన కొత్త పార్టీపై స్పందించాలని విలేకర్లు ఆయన కోరారు. అందుకు ప్రతిగా ప్రకాశ్ జవదేకర్ పై విధంగా స్పందించారు. అయితే ఇరు రాష్ట్రాలలో పొత్తులపై వారం రోజులలో స్పష్టత వస్తుందని తెలిపారు. అందుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుందన్నారు.