'ఓటుకు లేదు, నోటుకు లేదు' | no note, no vote, says cm ramesh | Sakshi
Sakshi News home page

'ఓటుకు లేదు, నోటుకు లేదు'

Jun 17 2015 6:58 AM | Updated on Sep 3 2017 3:53 AM

'ఓటుకు లేదు, నోటుకు లేదు'

'ఓటుకు లేదు, నోటుకు లేదు'

ఓటుకు కోట్లు కేసు టీడీపీ శిబిరంలో గుబులు రేపుతోంది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు టీడీపీ శిబిరంలో గుబులు రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డికి మంగళవారం రాత్రి సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఏసీబీ నోటీసులు జారీచేయడంతో 'పచ్చ' దళం కలవరపాటుకు గురైంది.

ఈ కేసులో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావు, శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఒక మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర దేశం నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సైకిల్ పార్టీలో సంచలనం రేపుతోంది. ఏసీబీ నోటీసులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం రమేశ్ తనదైన శైలిలో స్పందించారు. 'ఓటుకు లేదు, నోటుకు లేదు' అంటూ సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement