కోస్తాకు తప్పిన ముప్పు | no Depression danger to coastal area | Sakshi
Sakshi News home page

కోస్తాకు తప్పిన ముప్పు

Oct 20 2017 8:14 AM | Updated on Oct 20 2017 8:16 AM

no Depression danger to coastal area

సాక్షి, విశాఖపట్నం : కోస్తా ప్రజలకు ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా భయపెడుతున్న వాయుగుండం ముప్పు తప్పింది. అయితే అల్పపీడనం గంటకు 30కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. పారాదీప్‌కు 40 కిలోమీటర్లు, చాంద్‌బలికి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం  అయింది. ఈ అర్థరాత్రి పారాదీప్‌ సమీపంలో ఉత్తర ఈశాన్య దిశగా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో చదురుమదురు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే ఒకటో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement