సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించను | No Comment On Chandrababu Naidu Letter Said By AP CEO Gopal Krishna Dwivedi | Sakshi
Sakshi News home page

‘ఆ లేఖపై నేను స్పందించను’

Apr 26 2019 7:36 PM | Updated on Apr 26 2019 8:10 PM

No Comment On Chandrababu Naidu Letter Said By AP CEO Gopal Krishna Dwivedi - Sakshi

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది

అమరావతి: రాజకీయ పార్టీలు చేసే వ్యాఖ్యలపై తాను స్పందించనని, సొంత నిర్ణయాలు తీసుకోకుండా నిబంధనలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖపై స్పందించనన్నారు. శుక్రవారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ద్వివేది మాట్లాడుతూ సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోవడం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనావళికి సంబంధించిన పుస్తకాలను అన్ని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అందచేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని అధికారులు నిబంధనలను పాటిస్తున్నారా లేదా అన్న విషయంతో నాకు సంబంధం లేదని, తాను మాత్రం నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement