కొత్త పెళ్లికొడుకు పరార్! | newly wedded groom disappears from home | Sakshi
Sakshi News home page

కొత్త పెళ్లికొడుకు పరార్!

Jan 21 2014 8:56 AM | Updated on Sep 2 2017 2:51 AM

రాజు (ఫైల్ ఫోటో)

రాజు (ఫైల్ ఫోటో)

ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రులు గుర్తొస్తున్నారంటూ వరుడు పరారైయ్యాడు. దాంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రులు గుర్తొస్తున్నారంటూ వరుడు పరారయ్యాడు. దాంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆ సంఘటన హైదరాబాద్ శివారులోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కన్నీరు రాజు, అల్మాస్గూడకు చెందిన లక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.

అల్మాస్గూడలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. అయితే రాజు తనకు తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని, చూసి వస్తానని భార్య లక్ష్మికి చెప్పి ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లాడు. అంతే.. తర్వాత అతడి సమాచారం వస్తే ఒట్టు. దాంతో రాజు భార్య ఆందోళన చెంది, భర్త ఆచూకీ కోసం ప్రయత్నించింది. అయినా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement