breaking news
Newly Groom
-
నిశ్చితార్థం వేళ.. చితి మంటల ఘోష!
తూర్పు గోదావరి(పిఠాపురం): తెల్లారితే కాబోయే ధర్మపత్నికి దండ వేసి, ఉంగరాలు మార్చుకోవాల్సిన ఆ యువకుడి బతుకు అంతలోనే తెల్లారిపోయింది. నిత్యం వేదం పలికే ఆ గొంతు మూగబోయింది. తాంబూలాలు అందుకోవాల్సిన తండ్రి తల కొరివి పెట్టాల్సి వచ్చింది. కొద్ది గంటల్లో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. వింజమూరి వెంకటేష్ (30) పిఠాపురంలో పురోహితుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం అతని వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం ఉదయమే కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెళ్లి, వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వచ్చాడు. నిశ్చితార్థంలో వధువుకు, తనకు కావాల్సిన ఉంగరాలను తమ వేలి ముద్రలు ఉండేలా ప్రత్యేకంగా ముంబయిలో ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకున్నాడు. కొత్త దుస్తులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు, తోటి పురోహితులకు ఆహా్వనం పలికాడు. సంప్రదాయం ప్రకారం ఇంట్లో వారు నిశి్చతార్థానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. ఊహించని విధంగా శనివారం అర్ధరాత్రి పిఠాపురం సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి, రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. సామర్లకోట రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్య చేసుకునేంత సమస్యలేవీ లేవని చెబుతూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి శర్మ, తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నిశి్చతార్థం కోసం తెచి్చన పూలను అంతిమ యాత్రకు వినియోగించాల్సి వచ్చింది. నిశ్చయ తాంబూలాలకు వచ్చిన పెద్దలు, బంధువులు బరువెక్కిన గుండెలతో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఏదో బలమైన ఒత్తిడి... ఎవరో బెదిరించడం వల్లే వెంకటేష్ ఇలా అఘాయిత్యానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. -
కొత్త పెళ్లికొడుకు పరార్!
ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలలకే తల్లిదండ్రులు గుర్తొస్తున్నారంటూ వరుడు పరారయ్యాడు. దాంతో అతడి భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆ సంఘటన హైదరాబాద్ శివారులోని మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కన్నీరు రాజు, అల్మాస్‌గూడకు చెందిన లక్ష్మి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అల్మాస్‌గూడలోని రాజీవ్ గృహకల్పలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. అయితే రాజు తనకు తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని, చూసి వస్తానని భార్య లక్ష్మికి చెప్పి ఈ నెల 12న ఇంటి నుంచి వెళ్లాడు. అంతే.. తర్వాత అతడి సమాచారం వస్తే ఒట్టు. దాంతో రాజు భార్య ఆందోళన చెంది, భర్త ఆచూకీ కోసం ప్రయత్నించింది. అయినా అతడి ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.