డాన్స్ వివాదం.. నా కూతురిని ఆపే హక్కు నీకు లేదు | Grooms Stops Bride from Dancing Father Cancels Wedding | Sakshi
Sakshi News home page

డాన్స్ వివాదం.. నా కూతురిని ఆపే హక్కు నీకు లేదు

Jul 6 2026 9:16 AM | Updated on Jul 6 2026 10:49 AM

Grooms Stops Bride from Dancing Father Cancels Wedding

ఏఐ జనరేటర్

మార్కాపురం: పెళ్లి వేడుకల్లో చిన్నచిన్న కారణాలతో వివాదాలు తలెత్తడం కొత్తేమీ కాదు. అయితే పెళ్లి ఊరేగింపులో పెళ్లికూతురిని డాన్స్ చేయొద్దని వరుడు అడ్డు చెప్పాడనే కారణంతో పెళ్లికూతురు తండ్రి ఏకంగా పెళ్లినే రద్దు చేయించాడు..  

వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా, శనివారం రాత్రి వధూవరుల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ వధూవరులను కూడా నృత్యం చేయాలని కోరారు.

ఈ క్రమంలో పెళ్లికూతురు డాన్స్ చేయడానికి సిద్ధమవుతుండగా, వరుడు ఆమెను వారించినట్లు తెలుస్తోంది. ఈ విషయం పెళ్లికూతురు తండ్రికి ఆగ్రహం తెప్పించింది. "పెళ్లికి ముందే నా కూతురిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే, పెళ్లి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?" అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం తన కుమార్తెను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో వివాహం నిలిచిపోయింది.

ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ విభేదాలు తొలగకపోవడంతో పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అనంతరం కట్నం, కానుకలకు సంబంధించిన వ్యవహారాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

పెళ్లి జరగడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, డాన్స్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా వివాహం రద్దు కావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement