భూమా కుమారుడికి తప్పిన ప్రమాదం | Narrow escape for Shobha Nagireddy's son | Sakshi
Sakshi News home page

భూమా కుమారుడికి తప్పిన ప్రమాదం

May 14 2014 6:37 PM | Updated on Aug 14 2018 3:24 PM

భూమా కుమారుడికి తప్పిన ప్రమాదం - Sakshi

భూమా కుమారుడికి తప్పిన ప్రమాదం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విఖ్యాత్ రెడ్డి, అతడి స్నేహితులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. అయితే ఇంజిన్ నుంచి పొగ రావడాన్ని గుర్తించి వారు కారు దిగిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

బేగంపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో విఖ్యాత్ తల్లి శోభా నాగిరెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement