మోడీ ఎంపిక బీజేపీ సంప్రదాయానికి చిహ్నం | Narendra modi's selection proves our integrity, says laksmman | Sakshi
Sakshi News home page

మోడీ ఎంపిక బీజేపీ సంప్రదాయానికి చిహ్నం

Sep 14 2013 9:16 AM | Updated on Mar 29 2019 9:18 PM

ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎంపిక బీజేపీ సంప్రదాయానికి చిహ్నమని ఆపార్టీ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్ : ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎంపిక బీజేపీ సంప్రదాయానికి చిహ్నమని ఆపార్టీ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. 2014 ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు ప్రధాని అభ్యర్థి విషయంలో కూడా స్పష్టత లేదని లక్ష్మణ్ శనివారమిక్కడ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement