చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు ఆపాలి | Naaramalli Padmaja Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

భర్తకు కూడా చెప్పలేని ఆ విషయమేదో..

Jul 21 2020 7:43 PM | Updated on Jul 21 2020 9:35 PM

Naaramalli Padmaja Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దాదాపు అన్ని హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ పేర్కొన్నారు. మంగళవారం రోజున ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా విపత్తు సమయంలోనూ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా ప్రజలకు అందిస్తూ సీఎం జగన్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు ఆడిస్తోంది. (ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ)

సోమవారం రోజున విజయవాడలో జోలి కుమారి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పార్టీ పెద్దలు అన్యాయం చేశారని ఆరోపిస్తోంది. కానీ ఆమె భర్తేమో పార్టీకి సంబంధం లేదని మీడియాలో చెబుతున్నారు. ఆమె 2019లో చంద్రబాబు సీఎం కావాలని గుణదల కొండను మోకాళ్లతో ఎక్కింది. ఏదో అన్యాయం జరిగింది అని చెప్పుకుంటున్న జోలి కుమారి భర్తకు కూడా చెప్పలేని ఆ విషయమేదో వెల్లడించాలి. ఇప్పటికైనా చంద్రబాబు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు చేయించడం ఆపాల’ని పద్మజ హితువు పలికారు. (ఏపీ: పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement