అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

AP Government To MOU With Amul For Development Of Dairy Sector - Sakshi

ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. అమూల్‌తో  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన  ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మేనేజింగ్‌ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు. (అమూల్‌తో ఒప్పందం మహిళా సాధికారతకు తోడ్పాటు)

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అన్నారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా కింద మహిళలకు రూ.11వేల కోట్లు సాయం చేశాం. ప్రభుత్వ సహాయం మహిళల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top