వృద్ధురాలిపై హత్యాయత్నం | Murder attempt on Older Woman | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై హత్యాయత్నం

Aug 3 2015 3:59 PM | Updated on Jul 30 2018 8:29 PM

డబ్బు కోసం చెత్త ఏరుకునే వ్యక్తి ఓ వృద్ధురాలిపై హత్యాయత్నం చేశాడు.

ఆలమూరు(తూర్పుగోదావరి జిల్లా) : డబ్బు కోసం చెత్త ఏరుకునే వ్యక్తి ఓ వృద్ధురాలిపై హత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చింతలూరు గ్రామానికి చెందిన పద్మ(60) భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. కాగా గ్రామంలో చెత్త ఏరుకునే వెంకన్న సోమవారం ఆమెపై దాడి చేశాడు.

తలపై సీసాతో బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని ఆదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement