లాబీయింగ్‌లో రమేష్‌ నంబర్‌వన్‌

MP CM Ramesh number One In Lobbying : Sudhir Reddy - Sakshi

 అవినీతి సొమ్ముతోనే వేలకోట్లు గడించారు  

 డాక్టర్‌ సుధీర్‌రెడ్డి విమర్శ

సాక్షి, ఎర్రగుంట్ల : టీడీపీ నేత సీఎం రమేష్‌ లాబీయింగ్‌ చేయడంలో నంబర్‌ వన్‌ అని వైఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్లలోని పార్టీ కార్యాలయంలో ‘సాక్షి’తో మాట్లాడారు. 2014 ఎన్నికల మందు రిత్విక్‌ కంపెనీకి కేవలం 300 కోట్ల టర్నోవర్‌ ఉండేదని, ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే వేల కోట్లకు చేరుకుందన్నారు. దీన్ని బట్టి  ఏవిధంగా ఆవినీతి సోమ్ము సంపాదించారో తెలుస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.30లక్షలు దాకా ఖర్చు పెట్టి,  ప్రత్యేక విమానాల్లో తిరిగారని చెప్పారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టి బీటెక్‌ రవిని గెలిపించారని ప్రశ్నించారు. కానీ అది గెలుపు కాదన్నారు. టీడీపీ ఆర్టీపీపీలోని 6 మెగావాట్లలో ఆవినీతి జరిగిందన్నారు. రూ.3వేల కోట్లు ఉన్న ప్రాజెక్టులో సుమారు 800 కోట్లు సంపాందించారు.  

పోట్లదుర్తి – మాలెపాడు, గ్రామాల మధ్య  ఏ పనులైనా  రిత్విక్‌ కంపెనీ కనుసన్నలలో జరగాలి, వైఎస్సార్‌ సీపీ తరుపున టెండర్‌వేస్తే రాకుండా చేస్తారు. లేక పోతే పనులు జరగనివ్వరన్నారు.  లాబీయింగ్‌ చేయడంలో ఎంపీ రమేష్‌ నంబర్‌ వన్‌ అని అన్నారు. బీజేపీ కక్ష సాధింపు అనడడం సరికాదన్నారు.రమేష్‌ బలం చంద్రబాబు, అవినీతి సొమ్మేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చదవండి:

వేల కోట్లకు పడుగలెత్తిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌....

రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

సీఎం రమేశ్‌ రాజభవనం చూశారా?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top