రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

The Second Day Of The Ongoing IT Searches In CM Ramesh Houses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌ నివాసం, కార్యాలయాల్లో రెండవ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని రమేశ్‌ నివాసంలో అర్ధరాత్రి వరకు సోదాలు సాగాయి. రిత్విక్‌ ప్రాజెక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-12లో ఉన్న సీఎం రమేశ్‌ బావ గోవర్థన్‌ నాయుడు ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, నగదు, స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయనకు చెందిన రెండు బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు ఓపెన్‌ చేశారు. (చదవండి: సీఎం రమేష్‌ సంస్థల్లో ఐటీ సోదాలు)

అర్ధరాత్రి దాటాక రిత్విక్‌ ప్రాజెక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కార్యాలయానికి గోవర్థన్‌ నాయుడిని తరలించారు. కంపెనీ ఫైనాన్స్‌ వ్యవహారంలో గోవర్థన్‌ నాయుడు కీలకవ్యక్తిగా ఉన్నారు. సీఎం రమేశ్‌ సోదరుడు రాజేష్‌ను కూడా అధికారులు విచారించారు. శనివారం కూడా సీఎం రమేశ్‌ కార్యాలయం, నివాసాలపై ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top