టీడీపీ..అదొక రెంటల్ పార్టీ | mla vivekananda reddy takes on tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ..అదొక రెంటల్ పార్టీ

Mar 4 2014 8:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీడీపీ..అదొక రెంటల్ పార్టీ - Sakshi

టీడీపీ..అదొక రెంటల్ పార్టీ

ఎక్కడా టికెట్ దొరకని వారే టీడీపీలోకి వెళుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. అదొక రెంటల్ పార్టీగా మారిందని విమర్శించారు.

నెల్లూరు: ఎక్కడా టికెట్ దొరకని వారే టీడీపీలోకి వెళుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ధ్వజమెత్తారు. అదొక రెంటల్ పార్టీగా మారిందని విమర్శించారు. స్థానిక ఏసీసెంటర్‌లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి అభ్యర్థులు, కార్యకర్తలు కరువయ్యారన్నారు. టీడీపీ కేవలం ఫ్లెక్సీల్లో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ప్రమాదాలు ఎదురవుతాయనే నెల్లూరు సిటీలో  ముందు జాగ్రత్తలు తీసుకున్నానన్నారు. అందరి మన్ననలను పొందిన వారినే మేయర్‌గా ఎంపిక చేస్తామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. 

 

పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలన్న కాంక్షతో  ప్రతి విద్యార్థికి గ్రీటింగ్‌లు పంపుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా గ్రీటింగ్‌లను ఆయన విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు బర్నాబాసు, ఏసీ సుబ్బారెడ్డి, దిలీప్, కర్తం ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

 


 

Advertisement
 
Advertisement
Advertisement