నగరి కళాశాలకు ఎమ్యెల్యే వాటర్‌ ప్లాంట్‌ | MLA RK Roja Water plant opeing at Nagari College | Sakshi
Sakshi News home page

నగరి కళాశాలకు ఎమ్యెల్యే వాటర్‌ ప్లాంట్‌

Oct 7 2017 2:47 PM | Updated on Oct 29 2018 8:08 PM

MLA RK Roja Water plant opeing at Nagari College   - Sakshi

నగరి: పట్ణణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో లక్ష రూపాయల వ్యయంతో వాటర్‌ ప్లాంటును ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె ఆ ప్లాంటును ప్రారంభించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన సమయంలో తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. వాటర్‌ ప్యూరిఫయర్, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు మరుగుదొడ్లు కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. ప్రిన్సిపాల్‌ రఘుపతి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కే.శాంతి, మాజీ చైర్మన్‌ కేజే కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement