వైఎస్సార్‌ ఎనలేని కృషి | MLA Gummanur Jayaram Comments On YS Rajasekhar Reddy Kurnool | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఎనలేని కృషి

Jul 23 2018 8:14 AM | Updated on Mar 18 2019 9:02 PM

MLA  Gummanur Jayaram Comments On YS Rajasekhar Reddy Kurnool - Sakshi

జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌కు  చెందిన నాయకులు

హొళగుంద (కర్నూలు): దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌కు  చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్‌తో పాటు 200 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ నాయకుల్లో గుబులు పుడుతోందన్నారు. దళితుల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్‌ నిత్యం పాటు పడేవారని అవే లక్షణాలు వైఎస్‌ జగన్‌లో ఉన్నాయని చెప్పారు.

టీడీపీ పాలనలో వారి పార్టీ కార్యకర్తలకే పథకాలు వర్తింపజేసుకున్నారని అర్హులకు దక్కలేదని విమర్శించారు. వైఎస్సార్‌ పాలన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే సాధ్యమన్నారు. అనంతరం దళిత నాయకుడు తెలంగాణ ఐజీ ప్రవీణ్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా దళిత నాయకులు ఎమ్మెల్యేతో కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనువాసులు, హాలహర్వి మండలం కన్వీనర్‌ భీమప్పచౌదరి, మాజీ సర్పంచ్‌ అయ్యాళప్ప, ఎంపీటీసీ సభ్యులు మల్లికార్జున, గజ్జెళ్లి కెంచప్ప, నాయకులు పాల్తూరు గోవిందు, వందవాగిలి మేలగిరి, హోటల్‌ తిమ్మయ్య,  ఈశా, సౌదిబాషా,  రామకృష్ణ, సోమిరెడ్డి,  కిష్టప్ప, ఎల్లార్తి చిన్న దరగప్ప, వైకుంఠ, సిద్దేటీ, హెబ్బటం నందీశ, నారాయణ, శీన తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement