ఏపీని ఆదుకోండి : మిథున్‌ రెడ్డి

Mithun Reddy Asked Central Government To Provide Financial Assistance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభపక్ష నేత మిథున్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేఖలో.. కరోనా వైరస్‌తో దేశంపై 348 మిలియన్‌ డాలర్ల ప్రభావం పడిందని తెలిపారు. కరోనా మహమ్మారీతో ఆంధ్రప్రదేశ్‌ ఖజానా ఖాళీ అయ్యిందని, ఆర్థిక వనరుల మార్గాలన్నీ అడుగంటిపోయాయని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యం బలోపేతం, కరోనా కట్టడి చర్యలు, పేదలకు ఆర్థిక సహాయం.. తదితర చర్యలతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆదుకోవాలిన ఎంపీ కోరారు. (ఇంతకీ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ ఏంటి? )

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని డ్రాప్‌ చేయాలని, అన్ని వ్యాపార, పరిశ్రమల రుణాల రికవరీని ఏడాదిపాటు వాయిదా వేయాలని సూచించారు. ద్రవ్యలోటు అధిగమించి రాష్ట్రాలు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆర్బీఐతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ మిథున్‌రెడ్డి లేఖలో కోరారు. మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. (ఏపీలో తొలి కరోనా మరణం )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top