కరోనాపై అవగాహనకు ‘ఆరోగ్య సేతు’

Corona: Central Government Launch Aarogya Setu App - Sakshi

న్యూడిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 వేలకు పైగా చేరగా.. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కరోనాను దరి చేరకుండా అడ్డుకునేందుకు శుక్రవారం ఓ యాప్‌ను రూపొందించింది. ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా కోవిడ్‌-19 బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. (కరోనాపై పోరుకు బాలయ్య విరాళం )

అయితే ముందుగా ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్‌ల కోసం యాప్ స్టోర్‌లో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి. ఆ తరువాత పేరు, మొబైల్‌ నంబర్‌తో రిజిస్టార్‌ చేసుకోవాలి. వీటితోపాటు మన ఆరోగ్య విషయాలను. ఇతర ఆధారాలను నమోదు చేయాలి. ట్రాకింగ్‌ను ప్రారంభించడం కోసం ఫోన్‌లో జీపీఎస్‌, బ్లూటూత్‌ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది. (భారత్‌కు ప్రపంచ బ్యాంకు సాయం ఎంతంటే!)

యాప్‌ ప్రయోజనాలు..
దేశంలో కరోనా కేసుల అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు.
► కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది
కరోనావైరస్ ఉన్న వ్య‌క్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేష‌న్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్ర‌భుత్వానికి చేర‌వేస్తుంది.
 కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించ‌డానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.
కేంద్ర‌, రాష్ట్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్ర‌క‌ట‌న‌లు, తీసుకునే చ‌ర్య‌లను తెలియజేస్తుంది. (మరోసారి ‘జనతా’ స్ఫూర్తి కావాలి: ప్రధాని మోదీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top